రామగుండం మునిసిపల్ కార్పొరేషన్ అభివృద్ధి లో ముందడుగు….
అభివృద్ధి లో యువ మేయర్ భేష్…
పెద్దపల్లి//రామగుండం . వరద నీటి కాలువల్లో పూడిక తీత పనులను యుద్ద ప్రాతిపాదికన పూర్తి చేసి ప్రజల ఇబ్బందులు తీరుస్తామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు .
రామగుండం నగర పాలక సంస్థ ఆద్వర్యంలో 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” లో భాగంగా చేపట్టిన సానిటేషన్ స్పెషల్ డ్రైవ్ పనులను పరిశీలించడానికి శుక్రవారం తెల్లవారుఝామున్నే 3, 48, 49 డివిజన్ లలో పర్యటించి మురుగు నీటి కాలువలను పరిశీలించారు.
సాయిలీల హోటల్ ప్రక్క నుండి ప్రవహిస్తున్న మురుగు నీటి కాలువలో చేపట్టిన పూడిక తీత పనులను పర్యవేక్షించిన అనంతరం ఆయన మాట్లాడుతూ… కాలువ నిర్మించకపోవడం , పది సంవత్సరాలుగా సరిగా పూడిక తీయకపోవడంతో మురుగు నీరు నిలిచిపోయి పరిసరప్రాంత వాసులు భరించలేని దుర్గంధంతోపాటు అనేక రోగాల బారిన పడుతున్నారని అన్నారు. మల్కాపూర్ శివారు లో నిర్మిస్తున్న సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ నుండి టీచర్స్ కాలనీ వరకు వరద నీటి కాలువ కాంక్రీట్ నిర్మాణం చేపట్టి ఒక్క నీటి చుక్క కూడా నిలిచిపోకుండా సాఫీ గా ప్రవహించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.
నగరంలోని అన్ని ప్రదాన కాలువల్లో పూడిక తీత పనులు చేపట్టి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని అన్నారు. ఈ సంధర్భంగా ఆయన స్వయంగా జెసిబి యంత్రాన్ని ఆపరేట్ చేసి ముళ్ళ పొదలు, పిచ్చి చెట్లు తొలగించారు.
ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్ లతో పాటు డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి , ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి. వి. రామన్, టి పి ఎస్ నవీన్ , వార్డు అధికారులు , సానిటరీ ఇన్స్పెక్టర్లు , జవాన్లు , మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
