భౌరంపేట్ లహారి గ్రీన్ పార్క్ కాలనీ లో పర్యటించిన MLA కేపీ.వివేకానంద …
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ సర్కిల్ భౌరంపేట్ లోని లహారి గ్రీన్ పార్క్ కాలనీ లో గల సమస్యల గురించి MLA కేపీ. వివేకానంద కి విన్నవించుకోగా వారు స్థానిక నాయకులతో కలిసి కాలనీలో పర్యటించారు. అనంతరం వారితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. దాదాపు 1000 కుటుంబాల వరకు ఉండే ఈ కాలనీ లో రోడ్డు, స్ట్రీట్ లైట్స్ , వాటర్ మరియు డ్రైనేజీ సమస్యలు ఉన్నాయని కాలనీ వాసులు తెలుపగా వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు. కాలనీ లో గల రోడ్డు సమస్యను త్వరలోనే పరిష్కారం అయ్యేలా తగు చర్యలు తీసుకుంటానని తెలియజేసారు. తప్పకుండా కాలనీ కి అన్ని వసతులు కల్పించేందుకు తన వంతు పూర్తి సహకారం అందిస్తానని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ బాల్ రెడ్డి , భౌరంపేట్ మాజీ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , BRS నాయకులు బెంబెడి బుచ్చిరెడ్డి , ధర్మారెడ్డి , మురళీ యాదవ్ , విష్ణువర్ధన్ రెడ్డి , కామేశ్వరరావు మరియు కాలనీ సెక్రటరీ V.శ్రీనివాస్ రావు , ఆర్గనైసింగ్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి , మురళి కృష్ణ , ప్రశాంత్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
