2026-27 ఆర్థిక సంవత్సరమును పురస్కరించుకోని ధన లక్ష్మిదేవి పూజనునిర్వహించిన ఆర్జీ వన్ జీఎం లలిత్ కుమార్….

Spread the love

2026-27 ఆర్థిక సంవత్సరమును పురస్కరించుకోని ధన లక్ష్మిదేవి పూజను
నిర్వహించిన ఆర్జీ వన్ జీఎం లలిత్ కుమార్….

పెద్దపల్లి//గోదావరిఖని: సింగరేణి సంస్థ ఆర్జీ-1 ఏరియా జనరల్ మేనేజర్ కార్యలయం నందు
ఫైనాన్స్, ఎకౌంట్స్ డిపార్ట్ మెంట్ డిజియం ఫైనాన్స్ శ్రీమతి ధనలక్ష్మి బాయి అధ్యక్షతన, ధన లక్ష్మిదేవి పూజను శాస్త్రోక్తముగా నిర్వహించటం జరిగింది.

ఈ కార్యక్రమానికి ఆర్జీ-1 ఏరియా జియం డి.లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయి ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించటం జరిగింది.

ఈ సందర్భంగా జియం మాట్లాడుతు.. 2025-26 ఆర్థిక సంవత్సరమును ముగిసి నూతన ఆర్థిక సంవత్సరము 2026-27 గణాంకాలు ఏప్రిల్ నెలలో మొదలయి మార్చితో ముగుస్తాయని, కనుక ప్రతి ఆర్థిక సంవత్సరము మొదటి రోజున ఈ విధంగా ధన లక్ష్మిదేవి పూజ చేయడం అనావాయితిగా వస్తుందని తెలిపారు.

లక్ష్మి దేవి కృప కటాక్షాల కొరకు సింగరేణి సంస్థ ఉత్పత్తి ఉత్పాదకథా పెంపొందించుకొని మంచి లాభాల బాటలో ముందుకెళ్ళాలని ఫైనాన్స్, ఎకౌంట్స్ విభాగపు అధికారులు, ఉద్యోగులు ప్రత్యేకంగా ఈ పూజలో పాల్గోని లక్ష్మి దేవి ఆశీస్సులు తీసుకుంటే ఈ ఆర్థిక సంవత్సరము అంతా మంచి జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్జీ రీజియన్ క్వాలిటి జియం సుజోయ్ మజుందర్, యస్.ఓ టు జియం చంద్రశేఖర్, ఏరియా ఇంజనీరు రాంమోహనరావు, ఎజియం నాగేశ్వరరావు, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, అకౌంట్స్ అధికారులు క్రాంతి కుమార్, సౌమ్య ఇతర అధికారులు, లక్ష్మీరాజు, హనుమంత రావు, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top