
మౌళిక వసతులను మరింత మెరుగు పరిచి కుత్బుల్లాపూర్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి: ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ ..
పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు సర్కిళ్లకు చెందిన జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అధికారులతో బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ నియోజకవర్గంలోని నూతన అభివృద్ధి పనులు, నిర్మాణ దశలో ఉన్న అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…
అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మంజూరైన 32 కోట్ల విలువగల పనులను పూర్తి చేయాలని, అలాగే నూతనంగా 72 కోట్ల నిధుల వ్యయంతో రూపొందించిన ప్రతిపాదనలకు త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
ప్రజా అభివృద్ధి, సంక్షేమంలో భాగంగా వివిధ డివిజన్లో పరిధిలోని బస్తీలు, కాలనీలలో నిర్మాణ దశలో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలి.
నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ప్రాధాన్యత క్రమంలో నూతన సిసి రోడ్లతో పాటు రోడ్డు ప్యాచ్ వర్క్ నిర్మాణ పనులు, భూగర్భ డ్రైనేజీ, పార్కుల అభివృద్ధి, వీధి దీపాల ఏర్పాటు పనులను చేపట్టి ప్రజలకు మెరుగైన మౌళిక వసతులను కల్పించాలి.
పెరుగుతున్న పట్టణీకరణ, జనాభాకు అనుగుణంగా మెరుగైన మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా అవసరమైన చోట భూగర్భ డ్రైనేజీ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రణాళికలు రూపొందించి అభివృద్ధి పనులను చేపట్టి కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్ధాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఈ శ్రీకాంతి, ఈఈ సుబ్రహ్మణ్యం, డీఈఈలు పాపమ్మ, సంధ్య, డి. విరాట్ రాజ్, వసంత, బాల మురళీ, ఏఈలు అనురాగ్, కళ్యాణ్, గోపాల క్రిష్ణ, ప్రవీణ్ కుమార్, సురేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
