గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఎయిడ్స్ వ్యాధి పై అవగాహన ర్యాలీ…….

Spread the love

గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఎయిడ్స్ వ్యాధి పై అవగాహన ర్యాలీ…

పెద్దపల్లి//గోదావరిఖని: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన నిర్వహించడంతో పాటు దాని నివారణ కు సంబంధించిన విషయాలను గురించి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు.

ఈ సందర్భంగా గోదావరిఖని ఆర్ జి కే ఆఫీస్ నుంచి లక్ష్మీ నగర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహిస్తూ, ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పిస్తూ షాపులలో కరపత్రాలను పంపిణీ చేశారు.
అనంతరం ట్రాన్స్ జెండర్లకు హెచ్ఐవి, టీవీ, సిఫిలిస్ పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంవో డాక్టర్ కృష్ణ భాయి, పెద్దపల్లి పిఓ డాక్టర్ సుధాకర్ రెడ్డి డాక్టర్ శ్రీవాణి, వై ఆర్ జీ కేర్ టి ఐ ఏపీఎం శ్రీనివాస్, , జిల్లా ఐసీటీసీ సూపర్వైజర్ శ్రీనివాస్, డి ఎస్ ఆర్ సి కౌన్సిలర్ బబిత, ఐ సి టి సి కౌన్సిలర్ కట్కూరి శంకర్, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top