
చట్టవ్యతిరేక పనులపై జీరో టాలరెన్స్
** “ఆపరేషన్ వజ్రపహార్” లో కర్డన్ సెర్చ్ తనిఖీలు
తిరుపతి / కోడూరు: తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు ఆదేశాల మేరకు “ఆపరేషన్ వజ్రపహార్”లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా కోడూరు రూరల్ సర్కిల్ పరిధిలోని పుల్లంపేట మండలం, శ్రీరాములపేట గ్రామంలో
విస్తృత స్థాయిలో కర్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కోడూరు సీఐ ఆధ్వర్యంలో పుల్లంపేట, ఓబులవారిపల్లి, చిట్వేల్, పెనగలూరు, కోడూరు యూపీఎస్ ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే ప్రజలకు అవగాహన కల్పిస్తూ అనేక అంశాలపై సమావేశం నిర్వహించారు.
గంజాయి, మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలు గురించి తెలిపారు. రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. డయల్ 112 సేవల వినియోగం గురించి వివరించారు. అలాగే
శక్తి యాప్ ఉపయోగం ద్వారా మహిళల భద్రత గురించి, ఆస్తి నేరాలు…. సైబర్ క్రైమ్ నివారణ చర్యలు….చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై తిరుపతి జిల్లా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని, ఎటువంటి నేరాలకు పాల్పడినా క్షమించబోమని, ప్రజల భద్రత కోసం పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటారని హెచ్చరించారు.
ప్రజలు అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. సరైన పత్రాలు లేని 11 ద్విచక్ర వాహనాల స్వాధీనం చేసుకున్నారు.
అనుమానితులపై పోలీసు బలగాల సమిష్టి చర్యలతో ప్రాంతం అంతా గాలింపు చేపట్టారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
