
మహాత్మా జ్యోతిరావు ఫూలే ను నేటి సమాజం ఆదర్శంగా తీసుకోని పోరాడాలి…
ఏఐటీయూసీ నగర అధ్యక్ష, ప్రధానకార్యదర్శిలు అబ్దుల్ కరీం, శనిగరపు చంద్ర శేఖర్ లా పిలుపు…
పెద్దపల్లి : గోదావరిఖని: అల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటీయూసీ రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో స్థానిక మహాత్మ జ్యోతి రావ్ రావ్ పూలే విగ్రహానికి పులా మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ నగర అధ్యక్ష, ప్రధానకార్యదర్శి అబ్దుల్ కరీం, శనిగరపు చంద్ర శేఖర్ లు మాట్లాడుతూ.. సామాజిక విప్లవ కారుడు సంఘ సంస్కర్త, మహిళా విద్యా ఉద్యమ పితామహుడు, కుల వివక్ష వ్యతిరేకి తన జీవితాంతం పోరాటం చేసిన మహా మనిషి, మహాత్మలకే మహాత్మ అని వారు కొనియాడారు.
ఫూలే, 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలో జన్మించారు. ఆయన సమానత్వం, విద్య మరియు సామాజిక న్యాయం కోసం చేసిన కృషిని నేటిసామజికనికి తెలియ జేయవలిసిన అవసరం ప్రభుత్వం పై ఉందన్నారు.మహిళలకు, అణగారిన వర్గాలకు దళితులు, మాలీలకు విద్యను అందించేందుకు సతీమణి సావిత్రిబాయి ఫూలేతో కలిసి కృషి చేశారు.కుల వివక్షను రూపుమాపడానికి, సత్యశోధక్ సమాజ్ స్థాపించారు.
సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటాన్ని గుర్తించి, ప్రజలు ఆయనకు “మహాత్మా” అని గౌరవించారు. ఆయన రచనలు, అంటరానితనం నిర్మూలనకు, మహిళా సాధికారతకు మార్గదర్శకం అని వారు గుర్తు చేశారు.
ఫూలే జయంతి సందర్భంగా అసమానతలేని సమాజం కోసం యువత, ప్రజలందరూ పోరాడాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
