
లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులు అందజేసిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి హన్మంతన్న ||
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో పలువురు పేద ప్రజలు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ, చికిత్స ఖర్చులకు సరిపడా ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ని సంప్రదించగా, ఆయన వెంటనే స్పందించి రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా శస్త్ర చికిత్స నిమిత్తం ఆర్థిక సహాయం మంజూరు చేయించారు.
బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులకు CMRF మంజూరి పత్రాలు (చెక్కులు) అందజేశారు.
చింతల్ వాసులు, వేముల లక్ష్మమ్మ కి రూ. 60,000/-, గాయం సుస్మిత రెడ్డి కి రూ. 60,000/-
రంగనగర్ కాలనీ , చింతల్ వాసులు, నాగరాజు కి రూ. 60,000/-
కూకట్ పల్లి వాసులు, గోంగుల రాజు కి రూ. 56,500/-
బాచుపల్లి వాసులు, కొర్ర సునీత రాణి కి రూ. 47,500/-
ఈ సందర్భంగా హన్మంతన్న మాట్లాడుతూ......... ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పేద ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని, అనారోగ్యం బారిన పడిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు,. కార్యకర్తలు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
