ప్రజలతో మాట్లాడి ప్రజా సమస్యలు తీర్చడమే ప్రజా దర్బార్

Spread the love

ప్రజలతో మాట్లాడి ప్రజా సమస్యలు తీర్చడమే ప్రజా దర్బార్

సాక్షిత : రీ సర్వే సమస్యలు అధికారులు త్వరితగతిన పరిష్కరించాలి..

నాయకులు, అధికారులు ప్రజలకువారధిలా పనిచేయాలి.

ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

నెల్లూరు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటికి పరిష్కారాలు చూపడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి అన్నారు. ఇందుకూరు పేటలో ప్రజాదర్బార్ కార్యక్రమంలో వారు పాల్గొని ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతో ప్రజా దర్బార్ కు వచ్చే ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతో మన వద్దకు వస్తారనివారిపట్లసానుభూతితో వ్యవహరించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.ప్రజల నుంచి ఇంటి పట్టాలు, రీ సర్వే సంబంధ సమస్యల పై ఎక్కువగా వినతి పత్రాలు వస్తున్నాయనిఈసమస్యలనురెవెన్యూఅధికారులుపరిష్కరించాలన్నారు.

వారు వేదిక పై నుంచే జాయింట్ కలెక్టర్ కి ఫోన్ చేసిత్వరితగతినపరిష్కరించేలా కృషి చేయాలని చెప్పారు. చాలా గ్రామాలలో తాగునీరు, డ్రైన్లు, స్మశాన వాటికల స్థలాల సమస్యలు తన దృష్టికి వచ్చాయని దశల వారీగా ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.ఒక అర్జీ ఇస్తే, అది ఎన్ని రోజుల్లో పరిష్కారం అవుతుందో ప్రజలకు వివరించి మానవతా ధృక్పదంతో ఎలా సహాయం చేయవచ్చో అలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రజా ప్రతినిధులు అధికార యంత్రాంగానికి, సామాన్య ప్రజలకు మధ్య వారధిలా పని చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలోఇందుకూరుపేట మండల అధ్యక్షుడు ఏకొల్లు పవన్ రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, నెల్లూరు పార్లమెంటరీ అధికార ప్రతినిధి చెంచు కిషోర్, రాష్ట్ర ఎం ఎస్ ఎం వి డైరెక్టర్ వీరేంద్ర, అధికారులుకూటమి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top