
వేం నరేందర్ రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరై శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీ మరియు వరంగల్ జిల్లా నేతలు..
ఢిల్లీ లో వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రి సీతక్క , ఎంపీ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డీ కే ఆర్ నాగరాజు మరియు తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని, ఆయన తన అనుభవంతో ప్రజా సమస్యలను పార్లమెంట్‌లో సమర్థవంతంగా ప్రస్తావించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రజల ఆశయాలను నెరవేర్చే దిశగా ఆయన విశేషంగా సేవలందించాలని ఆకాంక్షించారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
