తెలంగాణ ఉద్యమకారుని అంతిమయాత్రలో పాల్గొని పాడెమోసిన .

Spread the love

తెలంగాణ ఉద్యమకారుని అంతిమయాత్రలో పాల్గొని పాడెమోసిన …………..*మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి : పెబ్బేరు మండలం యాపర్ల గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కీ”శే” గుడ్ల చిన్న నరసింహ ఆకస్మిక మరణం విషయాన్ని తెలుసుకున్న *మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి * వారి నివాసానికి వెళ్లి భౌతిక కాయానికి పూలమాల వేసి వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియ చేస్తూ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొని ఆయన పాడె మోశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టు యాదవ్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ మండల పార్టీ అధ్యక్షులు వనం రాములు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, కరే స్వామి మాజీ జెడ్పీటీసీ వెంకటేష్, మాజీ ఎంపిపి రాజ శేఖర్, సీనియర్ నాయకులు విశ్వ రూపం,సాయి, మాలపల్లి వీరాస్వామి, గోపి బాబు, మైనార్టీ అధ్యక్షులు, నజీర్, పాత పల్లి గోవింద్, కొండల్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top