బి పవర్ హౌస్ గుట్టపై ధనుర్ బాణా ఆంజనేయ స్వామి దర్శనం, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పూజలు

Spread the love

బి పవర్ హౌస్ గుట్టపై ధనుర్ బాణా ఆంజనేయ స్వామి దర్శనం, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దంపతుల ప్రత్యేక పూజలు


పెద్దపల్లి : రామగుండం పట్టణంలోని బి పవర్ హౌస్ గుట్టపై స్వయంభువుగా వెలసిన శ్రీ ధనుర్ బాణా ఆంజనేయ స్వామి ఆలయాన్ని రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ , వారి సతీమణి మనాలి ఠాకూర్ తో కలిసి దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా దంపతులు ఆలయ పరిసరాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందారు. అనంతరం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, “మన ప్రాంతంలోని బి పవర్ హౌస్ గుట్టపై వెలసిన ఈ ఆంజనేయ స్వామి ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు, ఆలయ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తాను” అని తెలిపారు.
ఈ దర్శనంతో ఆలయంలో భక్తి వాతావరణం నెలకొంది.

You cannot copy content of this page

Scroll to Top