
చిరు వ్యాపారుల పోట్టగొట్టడం అన్యాయం.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమామహేష్.
కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 99 రోజుల పాలన పేరిట సైబరాబాద్ మునిసిపల్ కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాలలో పొట్టకూటి కోసం కిరాయిలు చెల్లించలేని వారు రోడ్డుపై వ్యాపారం చేసుకుంటూ ఉంటే సుందరీ కరణ పేరుతో చిరు వ్యాపారులను తొలగించడం అన్యాయమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమామహేష్ నేడు పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రజా పాలన అని చెప్పుతూ బుల్డోజర్ పాలన ను చేస్తున్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వనికి, ప్రభుత్వ అధికారులకు పేదలంటే అలుసుగా కనిపిస్తూ వారి కూడును, గూడును చెదరగొడుతున్నారని ఇవన్నీ రేవంత్ రెడ్డికి తెలిసే జరుగుతున్నాయా అని రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించడం జరిగింది. ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వానికి మంచి పేరు కంటే చెడ్డ పేరు వస్తుందని అధికారులు కూడా విచక్షణతో ఆలోచిస్తూ పేద ప్రజల పొట్ట కొట్టొద్దని అలాంటి చర్యలు నిరసిస్తూ కమ్యూనిస్టు పార్టీగా రానున్న రోజుల్లో చిరు వ్యాపారులందరినీ సమీకరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సి వస్తుందని హెచ్చరించడం జరిగింది.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
