TEJA NEWS

హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ 2025 నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించిన — మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

మానవ హక్కుల ప్రజా రక్షణ సేవ సమక్షంలో 2025 నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరించిన అనంతరం కూన శ్రీశైలం గౌడ్ HRPS రాష్ట్ర నాయకులతో మాట్లాడుతూ ప్రజా రక్షణకు ఎల్లవేళలా కృషి చెయ్యాలని కోరడం జరిగింది…

తదనంతరం మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ నివాసం వద్ద పలు కాలనీల నాయకులు, సంక్షేమ సంఘాల ప్రతినిధులు, ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి తమ కాలనీలో నెలకొని ఉన్న సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. పలు వినతి పత్రాలు స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ వెంటనే స్పందించి వాటి పరిష్కారానికి ఆయా కాలనీ అభివృద్ధి కోసం సత్వర చర్యలు తీసుకుంటానని వారికి హామీ ఇచ్చినారు…

ఈ కార్యక్రమంలో HRPS రాష్ట్ర అధ్యక్షులు కొంపల్లి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు ఉపేందర్, అడ్వైసర్ ఉప్పల రమేష్ గుప్త, మంజుల, పార్వతి, ఇమ్మడి రవి శంకర్, బాలస్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు..


TEJA NEWS