
సమ్మె విరమించండి… సంయమనం పాటించండి – ఆర్టీసీ కార్మికులకు మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి…
చర్చల ద్వారా సమస్యల పరిష్కారం – ఆత్మహానికర చర్యలకు దూరంగా ఉండాలని పిలుపు…..
పెద్దపల్లి// ఆర్టీసీ కార్మికులు సంయమనం పాటించి సమ్మెను విరమించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. విడుదల చేసిన ప్రకటనలో కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని తెలిపారు.
కార్మికులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని, ప్రాణాలకు ముప్పు కలిగించే అనాలోచిత చర్యలకు పాల్పడి కుటుంబాలకు నష్టం కలిగించవద్దని కోరారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కొత్త సమస్యలకు దారితీస్తాయని హెచ్చరించారు.
ప్రేరేపిత శక్తుల ప్రభావానికి లోనవకుండా, ఆత్మనిబ్బరంతో ఉండాలని సూచించిన మంత్రి, కార్మిక సంఘాల నేతలు వెంటనే చర్చలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
