
కార్మికుల ఐక్యత వల్లే సమ్మె విజయవంతం.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.
ఆర్టీసీ సమ్మె విజయవంతమైన సందర్భంగా నేడు జీడిమెట్ల డిపో ఎదురుగా ఆర్టీసీ కార్మికులు సమావేశాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశానికి సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమామహేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఆర్టీసీ కార్మికులంతా ఒక్కటై జేఏసీగా ఏర్పడి సమ్మెలో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేసినందుకే ప్రభుత్వం దిగివచ్చి ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారం కొరకు ఒప్పుకుందని అదే ఐక్యత రానున్న రోజుల్లో చూపెట్టాలని కార్మికులను కోరడం జరిగింది. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను కనీసం చర్చలకు పిలవకపోగా మరింత క్రూరంగా వివరించి అధికారులతో కార్మికుల పైన అనేక ఒత్తిడిలను తీసుకొచ్చి కార్మికులను ఇబ్బందికి గురి చేసిందని ఇప్పటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా పైకి ప్రజా ప్రభుత్వమని చెబుతున్నప్పటికీ కొన్ని చోట్ల నియంత్రిత్వాన్ని అవలంబిస్తుందని కాబట్టి ఆర్టీసీ కార్మికులు మరింత జాగరుకతతో ఉండి కొట్లాడి సాధించిన డిమాండ్ల అమలు కొరకు నిత్యం పోరాడాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసమే సిపిఐ మరియు ఏఐటీయూసీ నాయకత్వం ఎల్లప్పుడూ పనిచేస్తుందని ఇక ముందు కూడా కార్మికుల నిర్వహించే అన్ని కార్యక్రమాలలో భాగస్వాములై ఆర్టీసీని మరింత బలోపేతం చేసుకుందామని పిలుపునివ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆర్టిసి జేఏసీ చైర్మన్ రాజు, అడ్వైజర్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు డానియల్, పాషా, జేఏసీ నాయకులు గోవర్ధన్ బాబు గీత ఖయ్యూం రాజేష్ నరసింహారెడ్డి లతోపాటు పెద్ద ఎత్తున ఆర్టీసీ కార్మికులు పాల్గొనడం జరిగింది.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
