
అనారోగ్యంతో చికిత్స చేయించుకుంటున్న బాధితుడికి ఎల్ఓసి అందజేత…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ *మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ * వారి నివాసంలో రోడ్డమేస్తిరి నగర్ డివిజన్ పరిధిలో గల శ్రీరామ్ నగర్ కి చెందిన షేక్ నజీర్ మియా అనారోగ్యం కారణం చేత నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సందర్భంగా వారి ఆర్థిక పరిస్థితి గమనించి మాజీ శాసనసభ్యులు ప్రభుత్వం ద్వారా (2,50,000) రెండు లక్షల యాభై వేల రూపాయల విలువ గల ఎల్ఓసి కాపీని ఈరోజు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదలకు అండగా నిలుస్తున్న ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదే విధంగా నియోజకవర్గంలోని ప్రజలందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు..
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
