
ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా, వేగంగా జరగాలి…..
సుగ్లాంపల్లి కేంద్రంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆకస్మిక తనిఖీ….
పెద్దపల్లి :
రైతుల నుండి ధాన్యం కొనుగోలు పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులకు ఆదేశించారు.
సుల్తానాబాద్ మండలంలోని సుగ్లాంపల్లి పాడీ ప్రొక్యూర్‌మెంట్ సెంటర్ (పీపీసీ )ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి, కొనుగోలు ప్రక్రియను సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులు తీసుకువచ్చే ధాన్యం తప్పనిసరిగా ఎఫ్‌ఏక్యూ (“సరసమైన సగటు నాణ్యత”) ప్రమాణాలకు అనుగుణంగా స్వీకరించాలని తెలిపారు. కేంద్రాల్లో తూకం, తేమ శాతం కొలతలు సక్రమంగా నిర్వహించి, ఎలాంటి ఆలస్యం లేకుండా రైతులకు వెంటనే రశీదులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా, ధాన్యం మిల్లులకు తరలించే ప్రక్రియలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, ఓపీఎంఎస్ లో వివరాలను సకాలంలో నమోదు చేయాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని పిపిసి ఇన్‌చార్జ్‌లకు ఆదేశించారు.
ఈ సందర్శనలో డి.ఎం. శ్రీకాంత్, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
