
కోదాడ పట్టణంలో శ్యామ్ ఎలక్ట్రానిక్స్ అండ్ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థను ప్రారంభం………………….*కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు…
వ్యాపారపరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం కోదాడ..
నాణ్యమైన సేవలతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి..
స్వయం ఉపాధి అవకాశాలతో యువత అభివృద్ధి చెందాలి…
వినియోగదారుల మన్నలను పొంది శ్యామ్ ఎలక్ట్రానిక్స్ అండ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధి చెందాలి… కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు…
వ్యాపారపరంగా శరవేగంతో అభివృద్ధి చెందుతున్న పట్టణం కోదాడ అని నాణ్యమైన సేవలతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు.
కోదాడ పట్టణంలో శ్యామ్ ఎలక్ట్రానిక్స్ అండ్ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థను ప్రారంభించి మాట్లాడారు.యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించుకొని ఎదగాలన్నారు. తాము ఉపాధి పొందటమే కాకుండా నలుగురికి ఉపాధి ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు. నాణ్యమైన సేవలతో వినియోగదారుల మండలాలను పొంది శ్యామ్ ఎలక్ట్రానిక్స్ అండ్ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ కోదాడ లో పేరు సాధించాలన్నారు.శ్యామ్ ఎలెక్ట్రానిక్ అండ్ రియల్ ఎస్టేట్ యజమానులు మాట్లాడుతూతమ షాప్ లో యాభై శాతం డిస్కౌంట్ తో వస్తువులు కస్టమర్లకు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, వైస్ ఛైర్మన్ దేవరపల్లి మల్లీశ్వరి, భాస్కర్, నిర్వాహకులు శ్యామ్, హరినాథ్ ,సుబ్బారావు, ఇమ్మానియేల్, ఆదినారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
