
మే20న జాతీయ లోక్ అదాలత్ను కక్షి దారులు సద్వినియోగం చేసుకోవాలి……… జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి కళార్చన
వనపర్తి:
వనపర్తి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టు లలో పెండింగ్ లొ ఉన్న క్రిమినల్ కేసులు, చెక్కు బౌన్స్ కేసులు, మైంటెనెన్సు కేసులు, గృహహింస చట్టం క్రింద నమోదైన కేసులు, ప్రమాద భీమా క్లెయిమ్ కేసులు, సివిల్ కేసుల పరిష్కారం కొరకు జాతీయ లోక్అదాలత్ ను ఈ నెల20 న నిర్వహించడం జరుగుతుందనీ కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి జి. కళార్చన తెలియజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కార్తీక్ రెడ్డి, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీలత, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎన్. అశ్విని, డి.ఎస్.పి బాలాజీ నాయక్, జిల్లాలోని సర్కిల్ ఇన్స్పెక్టర్స్, పోక్సో పి.పి శ్రీనివాస్ మరియు జిల్లాలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ కోర్టు కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
