
వాణిజ్య, వంట గ్యాస్ ధర పెంపు, వంట గ్యాస్ కొరతపై….. సిపిఐ నిరసన
….
వనపర్తి:
కేంద్ర ప్రభుత్వం వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ. 993 పెంచటం, వంట గ్యాస్ సిలిండర్ 25 రోజులకు ఒకటి సరఫరాపై సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో తీవ్ర నిరసన తెలిపారు. వాణిజ్య వంటగ్యాస్ సిలిండర్ను చౌరస్తాలో ఉంచి వాణిజ్య సిలిండర్ ధర తగ్గించాలని, వంటగ్యాస్ వారానికి ఒక సిలిండర్ ఇవ్వాలని, డీజిల్ పెట్రోల్ సరఫరా నిరంతరాయంగా కొనసాగించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సీనియర్ నేత మహిళా సమాఖ్య ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు కళావతమ్మ, వనపర్తి జిల్లా అధ్యక్షురాలు ఉపసర్పంచ్ కృష్ణవేణి, నియోజకవర్గ కార్యదర్శి రమేష్, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పృథ్వినాదం తదితరులు మాట్లాడుతూ.. వాణిజ్య సిలిండర్ ధర అమాంతం 44% పెంచడం వల్ల హోటళ్లలో ఆహార పదార్థాలు తినుబండారాల ధరలు విపరీతంగా పెరిగాయి అన్నారు. సిలిండర్ ధర పెంపుతో గతంలో ఉన్న ధరల కంటే 50% హోటల్లో యజమానులు పెంచేశారన్నారు. ఇతర ప్రాంతాలకు ఆస్పత్రులకు వెళ్లేవారు అనివార్యమైతే హోటల్ కి వెళ్లి అంత ధర పెట్టి టీ టిఫిన్ భోజనం చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. అంతేగాక వాణిజ్య సిలిండర్ ధర పెరగటంతో స్వచ్ఛంద సేవా సంస్థలు పేదలకు ఉచిత భోజనం పెట్టలేని పరిస్థితి ఉందన్నారు. హాస్టల్లో ఉండి చదువుకునే విద్యార్థుల మెస్ చార్జీలు పెంచారన్నారు.
వెంటనే వాణిజ్య గ్యాస్ సిలిండ ధరను తగ్గించాలని డిమాండ్ చేశారు. గతంలో వంట గ్యాస్ సిలిండర్ ఎప్పుడు అవసరమైన బుక్ చేసుకునే పరిస్థితి ఉండేదని ఇప్పుడు 25 రోజులకు ఒకసారి బుక్ చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఆలోపు గ్యాస్ అయిపోతే కట్టెల పొయ్యి పై వండుకోవాల్సి వస్తుందన్నారు. పెట్రోల్ డీజిల్ సరఫరా లో కేంద్రం వైఫల్యం చెందిందన్నారు. గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలను పెంచమని హామీ ఇచ్చి నరేంద్ర మోడీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. త్వరలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయని వినవస్తోందని ప్రజలు పోరాటానికి సిద్ధం కావాలన్నారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి రమేష్, భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు ఉపసర్పంచ్ కృష్ణవేణి, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పృథ్వినాదం, సిపిఐ వనపర్తి పట్టణ సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, డిహెచ్పిఎస్ సహాయ కార్యదర్శి శేఖర్, సిపిఐ మాజీ పట్టణ కార్యదర్శి ఎర్రకురుమయ్య, నాయకులు రమణ వంశీ రాంబాబు సురేష్ జ్యోతి సుప్రియ బాలిమియా గాయత్రి విజయ్ సామి తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
