
రామగుండం మున్సిపల్ కార్యాలయం బిజెపి ముట్టడి: ఎస్సీ/ఎస్‌టీ/బీసీ మైనార్టీ కోసం డహన సకీమ్ పునరుద్ధరణ డిమాండ్….
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం, భారతీయ జనతా పార్టీ మాజీ జిల్లా కార్యదర్శి జక్కుల నరహరి నేతృత్వంలో బిజెపి కార్యకర్తలు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడి చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసిపేట శివాజీ, జిల్లా నాయకులు మరియు మాజీ కార్పొరేటర్లు పాల్గొని, గత ప్రభుత్వంలో ఆర్థిక సాయం కోసం ఆపేసిన డహన సకీమ్‌ను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
కార్పొరేషన్‌లో దాదాపు 120 కుటుంబాలు రోడ్డుపై పడిన పరిస్థితిని గుర్తుచేసి, గతంలో పనిచేసిన వారికి చెల్లించవలసిన రూ.26 లక్షల బిల్లును వెంటనే విడుదల చేయాలని వినతిపత్రం అందజేశారు. బిల్లు విడుదల చేయకపోతే వారం రోజులలో బిజెపి పెద్దఎత్తున ధర్నా చేపట్టతారని హెచ్చరించారు.
జిల్లా కార్యదర్శి సోమారపు లావణ్య మాట్లాడుతూ, మరణ ధ్రువీకరణ పత్రాలను తక్షణం అందించాలి, మున్సిపల్ అధికారులు ప్రజల కోసం సమర్థవంతంగా వ్యవహరించాలి అని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఇతర బిజెపి నేతలు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
