
తెలంగాణ ఫుడ్స్ దేశానికి ఆదర్శం….
–డా.బి.జనక్ ప్రసాద్…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: నాచారం, హైదరాబాద్: తెలంగాణ ఫుడ్స్ నూతన క్యాంటీన్ భవన ప్రారంభోత్సవం సందర్భంగా, తెలంగాణ శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ ఎం.ఎ. ఫహీం, స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తదితరుల చేతిలో తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి ఛైర్మన్, తెలంగాణ ఫుడ్ యూనియన్ అధ్యక్షుడు డా. బి. జనక్ ప్రసాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
డా. బి. జనక్ ప్రసాద్ మాట్లాడుతూ, “బాలింతలు, చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడం ఒక సామాజిక బాధ్యత. తెలంగాణ ఫుడ్స్ ఈ సేవను గత 50 ఏళ్లుగా నిరంతరం నిర్వహిస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచింది. కార్మిక సంక్షేమం, ఉద్యోగుల భద్రత, సంక్షేమ పథకాల అమలులో సంస్థ ముందంజలో ఉంది” అని పేర్కొన్నారు.
అలాగే, కార్మికుల కృషి, ఉద్యోగుల అంకితభావం వల్లే తెలంగాణ ఫుడ్స్ ఈ స్థాయికి చేరిందని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తెలంగాణ ఫుడ్స్ నూతన ఐఎన్టియూసి యూనియన్ కార్యాలయాన్ని చైర్మన్ మరియు ఎండీ చేతుల ద్వారా ప్రారంభించారు.
సభలో సెక్రటరీ అనిత రామచంద్రన్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, సంస్థ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, యూనియన్ జనరల్ సెక్రటరీ దస్తగిరి, ఇతర అధికారులు, యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
