
స్వీయ గణన సదుపాయాన్ని సమర్థంగా వినియోగించాలని రామగుండం కమీషనర్ జె.అరుణ శ్రీ ఆదేశం…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి//రామగుండం, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) మరియు రామగుండం నగర పాలక సంస్థ కమీషనర్ జె.అరుణ శ్రీ స్వీయ గణన సదుపాయాన్ని పకడ్బందీగా వినియోగించాలన్నారు. సిబ్బందికి క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని, వారి భాద్యతలను సమర్థవంతంగా నిర్వహించమని ఆదేశించారు.
గురువారం ప్రశాంత్ నగర్, గంగా నగర్, బస్ స్టాండ్ కాలనీ తదితర ప్రాంతాలలో పర్యటించి సిబ్బంది పని తీరును పరిశీలించిన కమీషనర్, ఈ నెల 10వ తేదీతో స్వీయ గణన చేసుకోవడానికి గడువు ముగిసిపోతున్నందున సిబ్బందికి త్వరపడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు ఎ సి పి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
