
వీర్లపల్లిలో పోలీసుల భారీ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం…
ప్రత్యేక వాహన తనిఖీల్లో 50 బైక్‌లు సీజ్….
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గోదావరిఖని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వీర్లపల్లి గ్రామంలో నేర నియంత్రణ, ప్రజా భద్రత లక్ష్యంగా భారీ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గోదావరిఖని 2 టౌన్ సీఐ ప్రసాద్‌రావు ఆధ్వర్యంలో చేపట్టారు.
కార్యక్రమంలో సీఐ ప్రసాద్‌రావుతో పాటు కమాన్‌పూర్ ఎస్ఐ ప్రసాద్ పాల్గొని గ్రామ ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోరాదని సూచించారు.
యువత ఆన్లైన్ గేమ్‌లకు బానిస కాకుండా జాగ్రత్తగా ఉండాలని సీఐ సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు వాహన పత్రాలు వెంట ఉంచుకోవాలని తెలిపారు.
గ్రామాల్లో జరుగుతున్న ఆస్తి సంబంధిత నేరాలను అరికట్టేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించి సుమారు 50 బైక్‌లను సీజ్ చేశారు. పత్రాలు లేని వాహనాలు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు సీఐ ప్రసాద్‌రావు వెల్లడించారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
