
ప్రభుత్వ భూమి కబ్జా అరికట్టి మహనీయుల విగ్రహాల నిర్మాణానికి సహకరించాలి
మోతె: మండల పరిధిలోని మామిళ్ళగూడెం గ్రామంలో సర్వే నెంబర్ 351లో ఉన్న సుమారు 21 గుంటల ప్రభుత్వ భూమిని గ్రామంలోని కొందరు వ్యక్తులు అక్రమంగా కబ్జా చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ భూమిలో మహనీయుల విగ్రహాల నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారని వారు తెలిపారు.
అక్రమ భూమి కబ్జాలను వెంటనే అరికట్టి ప్రభుత్వ భూమిని రక్షించాలని కోరుతూ గ్రామస్తులు తహసీల్దార్ ఎం. వెంకన్నకు వినతిపత్రం అందజేశారు. ప్రజలకు ఉపయోగపడే స్థలాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆక్రమించడం సరైంది కాదని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్తులు నవిలే నర్సయ్య, వెంకన్న, కొరవి వీరాస్వామి, అంబేద్కర్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
