
అభివృద్ధి నిరంజనుడిది…ఆర్భాటాలు ఎం.ఎల్.ఏవి మంత్రులవి………… జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్.
వనపర్తి :
మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నియోజకవర్గానికి అవసరమైన అభివృద్ధి, శాశ్వత పథకాలకోసం నిధులు వెచ్చించి పూర్తి చేశారని మాజీ మంత్రి చేసిన అభివృద్ధిని.
ఎంతో ఆర్భాటంగా ప్రస్తుత మంత్రి, ఎం.ఎల్.ఏలు కలిసి నేడు ప్రారంభించిన డిజిటల్ జిల్లా గ్రంథాలయం నిరంజన్ రెడ్డి సాధించిన విషయం గుర్తెరగాలని బి ఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి.శ్రీధర్ అన్నారు.
ఏ లక్ష్యంతో కోట్ల రూపాయలతో నిర్మించిన మార్కెట్ సముదాయాన్ని ఆ లక్ష్యసాధనకు అసమర్థత ఈనాటి ఎం.ఎల్.ఏ ది అని వాకిటి విమర్శించారు
ఎం.ఎల్.ఏ ఎన్నికైన నాటి నుండి నేటి వరకు ఒక్క కొత్త అభివృద్ధి పథకం తీసుకురాలేదు కానీ పత్రికా ప్రకటనలలో మాత్రం వేల కోట్ల అంకెల గారడి చేసి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.
90శాతం పూర్తి అయిన రోడ్ల విస్తరణ మిగిలిన 10శాతం పనులు పూర్తి చేయాలని అసమర్థత నేటి పాలకులది అని దుయ్యబట్టారు.
ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల విషయములో అరకొర ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు తప్ప ఒక్క కొత్త సంక్షేమ పథకం అమలు కాలేదని ఇచ్చిన 6 గ్యారంటీలు, 11డిక్లరేషన్లు,420హామీలు గాలికి వదిలేసింది ప్రభుత్వం అని విమర్శించారు.
నిరంజన్ రెడ్డి సాధించిన పథకాలకు ప్రారంభోత్సవాలు చేయడం మాని కొత్త పథకాలు తెచ్చి చూపాలని డిమాండ్ చేశారు.
రైతులు ధాన్యం కొనుగోళ్లు లేక పడిగాపులు కాస్తూ ఉంటే రైతులను పాటించుకోకుండా మంది మార్భలాన్ని వేసుకొని హంగామా చేసుకుంటూ కాలం గడుపుతున్న ఎం.ఎల్.ఏ కి ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని వాకిటి హెచ్చరించారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
