
కరెంట్ షాక్‌తో మృతి చెందిన బర్రెల బాధితులకు ల్ప్రభుత్వ నష్టపరిహారం అందజేసిన…..డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి
వనపర్తి జిల్లా గోపాల్‌పేట్ మండలం జయన్న తిరుమలాపురం గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన బర్రెల యజమానులకు ప్రభుత్వం తరఫున డాక్టర్ జిల్లాలో చిన్నారెడ్డి చేతుల మీదుగా నష్టపరిహారం అందజేశారు. అక్టోబర్ 24న పూసల చెరువు సమీపంలో జరిగిన ఈ ఘటనలో మొత్తం 8 బర్రెలు మృతి చెందాయి. దీంతో తీవ్రంగా నష్టపోయిన రైతులు తమకు ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ని కోరారు. రైతుల పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న చిన్నారెడ్డి విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి బాధిత రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు చేపట్టారు. దీనిపై స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు ఒక్కో బర్రెకు రూ.40 వేల చొప్పున నష్టపరిహారం మంజూరు చేశారు. ఈ సందర్భంగా మద్దులకొల్ల మల్లయ్య భార్య గీతకు రూ.2,40,000 చెక్కును, భాస్కర్ రెడ్డికి రూ.80,000 చెక్కును చిన్నారెడ్డి , విద్యుత్ శాఖ తరపున జిల్లెల తిరుపతి రెడ్డి , గ్రామ సర్పంచ్ కావలి జ్యోతి గోపాల్ కలిసి అందజేశారు. ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందించినందుకు బాధిత రైతులు గీత, భాస్కర్ రెడ్డి లు రాష్ట్ర ప్రభుత్వం మరియు చిన్నారెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో లోకా రెడ్డి, రంగారెడ్డి, కురుమయ్య, కురువమ్మ తదితర గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
