
శ్రమశక్తి అవార్డు గ్రహీత ఈదునూరి పర్వతాలకు ఘన సన్మానం….
–ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి రామగుండం,
ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో శ్రమశక్తి అవార్డు గ్రహీత, తెలంగాణ ఉద్యమ నాయకుడు ఈదునూరి పర్వతాలు గారిని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా సంఘం జిల్లా కన్వీనర్ పెగడపల్లి నారాయణ భవాని మాట్లాడుతూ, ఈదునూరి పర్వతాలు కార్మిక వర్గ హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ, అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేస్తున్న అంబేద్కర్ వాదిగా కొనియాడారు. సమాజ సేవలో ఆయన చేస్తున్న సేవలు యువతకు ఆదర్శమని పేర్కొన్నారు.
అనంతరం శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, ఎన్టీపీసీ పట్టణ గౌరవాధ్యక్షులు పుల్లూరి నాగభూషణం, పట్టణ అధ్యక్షుడు దొమ్మటి శేఖర్, అంబేద్కర్ వాది పెగడపల్లి శ్రీనివాస్, ఎన్టీపీసీ ఆటో యూనియన్ ప్రధాన కార్యదర్శి రేవెల్లి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
