మేడ్చల్ జిల్లా 10వ తరగతి టాపర్ భౌరంపేట్ విద్యార్థి లక్ష్మీనారాయణ ను అభినందించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద .

Spread the love

మేడ్చల్ జిల్లా 10వ తరగతి టాపర్ భౌరంపేట్ విద్యార్థి లక్ష్మీనారాయణ ను అభినందించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద .

ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో మేడ్చల్ జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో జిల్లా టాపర్‌గా నిలిచిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ సర్కిల్, భౌరంపేట్ పాఠశాల విద్యార్థి లక్ష్మీనారాయణ మరియు దుండిగల్ మండల్ ద్వితీయ స్థానం వచ్చిన గాగిల్లపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థి శైలజను బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద వారిని అభినందిస్తూ శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి జిల్లా టాపర్‌గా నిలవడం గర్వకారణమని కొనియాడారు. భవిష్యత్తులో మరింత కష్టపడి చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని, తల్లిదండ్రులకు, పాఠశాలకు, ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

అలాగే విద్యార్థిని ఈ స్థాయికి తీసుకురావడంలో కృషి చేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామిరెడ్డి ని, భిక్షపతి గౌడ్ ని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం ఆనందకరమని, ఉపాధ్యాయుల కృషి అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో భౌరంపేట్ మాజీ కౌన్సిలర్లు నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , నాచారం మురళీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top