మోతేలో నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ నూతన శాఖ ప్రారభించిన కోదాడ ఎమ్మెల్యే పద్మావతి

Spread the love

మోతేలో నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ నూతన శాఖ ప్రారభించిన కోదాడ ఎమ్మెల్యే పద్మావతి

మోతే: మోతే మండల కేంద్రంలో నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ నూతన శాఖను కోదాడ శాసన సభ్యురాలు నల్లమాద పద్మావతి రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించేందుకు సహకార బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. రైతులు, మహిళా సంఘాలు, చిన్న వ్యాపారులు బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బ్యాంక్ సీఈఓ శ్రీ శంకరరావు, జీఎం శ్రీమతి నర్మద, నాబార్డ్ డీడీఎం శ్రీ రవీందర్ నాయక్, బ్యాంక్ డీజీఎం శ్రీ కురువా నాయక్, ఏజీఎం శ్రీ వెంకటేశ్వర్లు, బ్యాంక్ మేనేజర్ శ్రీమతి మాధవి, బ్యాంకు సిబ్బంది ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు, ఖాతాదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు .

You cannot copy content of this page

Scroll to Top