
సుందరయ్య ఆశయాల సాధనకే నిజమైన నివాళి
సీపీఎం ఆధ్వర్యంలో ఘనంగా 41వ. వర్ధంతి వేడుకలు….
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట రథసారథి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి వేడుకలను మంగళవారం సీపీఎం పార్టీ ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
సీపీఎం పార్టీ ఎన్టీపీసీ పరిధిలోని 1వ డివిజన్ ఇందిరమ్మ కాలనీలో టీ రవీందర్, 3వ డివిజన్ మల్కాపూర్‌లో శాఖ కార్యదర్శి దండ రాఘవరెడ్డి, అన్నపూర్ణ కాలనీలో ఆర్ఐడబ్ల్యూయూ శాఖ కార్యదర్శి కాదాసి మల్లేష్ పార్టీ జెండాలను ఆవిష్కరించారు.
అనంతరం సీపీఎం పార్టీ ఎన్టీపీసీ రామగుండం ఏరియా కార్యదర్శి ఎం. రామాచారి, గీట్ల లక్ష్మారెడ్డి, దండ రాఘవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో సుందరయ్య పోషించిన పాత్ర చారిత్రాత్మకమని పేర్కొన్నారు. పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటికీ ఎంతో నిరాడంబరమైన జీవితాన్ని గడిపి ఆదర్శ రాజకీయాలకు మారుపేరుగా నిలిచారని కొనియాడారు.
కార్మిక, విద్యార్థి, ప్రజాసంఘాల నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని, దోపిడీ రహిత సమాజ నిర్మాణమే ఆయన లక్ష్యమని పేర్కొన్నారు.నేటి సమాజంలో పాలకుల ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతూ సుందరయ్య ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఎం. రామాచారి, గీట్ల లక్ష్మారెడ్డి, దండ రాఘవరెడ్డి, కాదాసి మల్లేష్, టీ. రవీందర్, కే. రాజ్‌కుమార్, ఎండి షమీం, టి. నారాయణరెడ్డి, ఏ. చంద్రమౌళి, ఏ. రమేష్, నాగరాజు, మహిపాల్ రెడ్డి, భాస్కర్, ఎం. కనకయ్య, దర్ని రాజయ్య, రాజమల్లు తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తలు, ప్రజాసంఘాల ప్రతినిధులు, కాలనీవాసులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
