
ఇందిరమ్మ ఇళ్లతో పేద కుటుంబాలకు సొంతింటి కల సాకారం…
తూర్పు తండాలో నూతన గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు …
వరంగల్ జిల్లా పర్వతగిరి మండల పరిధిలోని తూర్పు తండాలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల నూతన గృహప్రవేశ కార్యక్రమంలో గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పాల్గొన్నారు…
ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబాలకు బట్టలు అందజేసి, వారి కొత్త ఇంట్లో సుఖశాంతులు నెలకొనాలని ఆశీర్వదించారు. పేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు…
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు మరింత వేగంగా అమలు చేస్తున్నామని అన్నారు..
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు….
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
