
సూర్యాపేటలో డాగ్ స్క్వాడ్ విస్తృత తనిఖీలు
సూర్యాపేట జిల్లా
మాదకద్రవ్యాల నిర్మూలన, గుర్తింపు లక్ష్యంగా జిల్లా కేంద్రంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. డాగ్ స్క్వాడ్ సాయంతో టీ స్టాళ్లు, పాన్ షాపులు, రోడ్డు పక్కన ఉన్న హోటళ్లు, బస్టాండ్ ప్రాంతాలు, షాపింగ్ మాల్స్‌లలో నిశితంగా తనిఖీలు చేపట్టారు. గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగం, విక్రయాన్ని అరికట్టేందుకు ప్రత్యేకంగా నార్కోటిక్ డాగ్‌ను వినియోగించారు. ఈ తనిఖీల్లో సూర్యాపేట పట్టణ పోలీసులు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు. సమాజంలో మత్తు పదార్థాల నిర్మూలనకు జిల్లా పోలీస్ శాఖ కట్టుబడి ఉందని, ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
