
ధాన్యం సేకరణ ను వేగవంతం చేయాలి
తహసీల్దార్ ముట్టడి
వనపర్తి :
వనపర్తి నియోజకవర్గంలోని పెబ్బేరు మండల
భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో రైతుల దాన్య సేకరణ ను వేగవంతం చేయాలనీ, లేకుంటే రైతులతో కలిసి పెద్దయత్తున ధర్నాలు చేపడతామని గురువారం తాసిల్దార్ ముట్టడి కార్యక్రమంలో వారు హెచ్చరించారు కార్యాలయంముట్టడి కార్యక్రమంలోజిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలులో తరుగు పేరిట జరుగుతున్న మోసాలు, కొనుగోలులో ఆలస్యం కారణంగా ఆకాల వర్షాలతో రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని కావున వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు .
తహసీల్దార్ ముట్టడి అనంతరం వినతి పత్రం అందజేసిన వారిలో జిల్లా ఉపాధ్యక్షులు మొగిలి రాఘవేంద్ర గౌడ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ రంగస్వామి గౌడ్, పెబ్బేరు మండల అధ్యక్షుడు ఆడెం నాగరాజు, జిల్లా విద్యాసెల్ కన్వీనర్ నరసింహనాయుడు, ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు చింతల రామకృష్ణ, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు కశిరెడ్డి వెంకట్ రామ్ రెడ్డి , జిల్లా బీజేవైఎం నాయకులు చింతకాయల శివ, పట్టణ ప్రధాన కార్యదర్శులు సర్వేశ్వర్ గౌడ్, మోతే రాఘవేంద్ర, గోనెలా అరవింద్, బాలకృష్ణ, మండల ప్రధాన కార్యదర్శిలు గోవిందునాయుడు, శాఖాపూర్ రఘు, గంధం శివ, బలరాం, వడ్డె ప్రసాద్, వడ్డే తిరుపతయ్య, సతీష్, విరాంజనేయలు తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
