
మహిళా పోలీస్ స్టేషన్ నూతన సీఐ రమేష్ బాబుకు ఘన సన్మానం…
ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించిన నాయకులు…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మహిళా పోలీస్ స్టేషన్కు నూతనంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సీఐ)గా బాధ్యతలు స్వీకరించిన జి. రమేష్ బాబు గారిని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్, సీపీఐ ప్రజా సంఘాల నాయకులు ఎం.ఎ. గౌస్, వై. లెనిన్, తొడుపునూరి రమేశ్ కుమార్లు శాలువా కప్పి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మద్దెల దినేష్ మాట్లాడుతూ, రమేష్ బాబు గారు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తూ ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించి మంచి అధికారిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన నిబద్ధత, సేవాభావం ప్రశంసనీయమని అన్నారు.
మహిళల భద్రత, సంక్షేమం కోసం మరింత సమర్థవంతంగా పనిచేస్తూ ప్రజలకు చేరువయ్యే విధంగా సేవలందించాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా సంఘాల ప్రతినిధులు, నాయకులు పాల్గొని నూతన సీఐ రమేష్ బాబుకు అభినందనలు తెలిపారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
