
కోవును అభివృద్ధి బాటలో నడిపిస్తున్న ప్రశాంతి రెడ్డి కాటంరెడ్డి చంద్రారెడ్డి.
కోవూరు లో 27, 28, మహానాడు పసుపు పండగను జయప్రదం చేయాలి
కోవూరు నియోజకవర్గ అభివృద్ధి అంశం లో వేమిరెడ్డికి ముందు..వేమిరెడ్డి తరువాత అనేంతగా స్పష్టమైన విభిన్నత ను కోవూరు ప్రజలు చూస్తున్నారని నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు కాటంరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కోవూరు మండలం పడుగుపాడు గ్రామం లోని పవర్ స్టేషన్ ఆవరణ లో యంఎస్ యంఈ పార్క్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన నివాసం లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గం శరవేగంగా పారిశ్రామికాభివృద్ధి వైపు కు దూసుకెళ్తుందన్నారు. ఈ మెగా ప్రాజెక్ట్ పడుగుపాడు గ్రామం లో లాంచ్ చేయడం ద్వారా అనేక సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఈ ప్రాంతానికి రానున్నాయని తెలిపారు.
తద్వారా ఇక్కడ యువత కు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని చంద్రారెడ్డి అభినందించారు. ఇఫ్కో కిసాన్ సెజ్ లో సైతం పరిశ్రమలు పోటెత్తనున్నాయన్నారు. అలాగే షుగర్ ఫ్యాక్టరీ భూముల లో కొత్త పరిశ్రమలు తెచ్చేందుకు వేమిరెడ్డి దంపతులు ముమ్మర కృషి చేస్తున్నారని కొనియాడారు.కోవూరు నియోజకవర్గం రూపురేఖలు మారుస్తున్న వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి 27, 28, జరిగే మహానాడు పసుపు పండుగను జయప్రదం చేసి కోవూరు నియోజకవర్గం కి ఆంధ్రప్రదేశ్ లోనే మంచి పేరు తీసుకురావాలని వారు పిలుపునిచ్చారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
