
క్యాన్సర్ అవగాహన మరియు స్క్రీనింగ్ ఆరోగ్య కార్యక్రమం విజయవంతం
బాచుపల్లి పరిధిలోని కౌసల్య కాలనీ నివాసితుల ఆరోగ్య సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని క్యాన్సర్ అవగాహన మరియు స్క్రీనింగ్ ఆరోగ్య కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని *నిజాంపేట్ సర్కిల్ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి * ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ముందస్తుగా గుర్తిస్తే పూర్తిగా నియంత్రించవచ్చని తెలిపారు. ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, ఆరోగ్యమే ప్రతి కుటుంబానికి మూలధనమని పేర్కొన్నారు. ఇటువంటి అవగాహన మరియు స్క్రీనింగ్ కార్యక్రమాలు ప్రతి కాలనీలో నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు తాతి రెడ్డి, కె. ఇందిర, చంద్రమౌళి, వి. సత్య, KCWA అధ్యక్షులు వి. రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ 17వ వార్డు అధ్యక్షులు తిరుపతి రెడ్డి, ఉపాధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. రామాంజనేయులు (అంజి బాబు) పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
కాలనీ ప్రజలకు క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం, ముందస్తు స్క్రీనింగ్ ద్వారా ఆరోగ్య రక్షణను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమానికి సేవలందించిన వైద్య బృందానికి, హాజరైన అతిథులకు మరియు పాల్గొన్న ప్రతి నివాసితుడికి నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఆరోగ్యమే మహాభాగ్యం – ముందస్తు గుర్తింపే రక్షణ
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
