
రోడ్డు ప్రమాదంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బొలెమొని రాములు కు తీవ్ర గాయాలు
వనపర్తి :
జిల్లా కేంద్రంలో గాంధీ చౌక్ లో మల్టీస్పెషల్టి హాస్పిటల్ దగ్గర రోడ్డు ప్రమాదంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ బి రాములు కు ఎడమకాలుకు తీవ్ర గాయాలయ్యా యని జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తెలిపారు బి రాములు ఇంటికి వెళుతున్న క్రమంలో ట్రాక్టర్ డి కొట్టడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు వెంటనే హైదరాబాద్ కు తరలించారని హైదరాబాదులో మోకాలి కి చికిత్స నిర్వహించారని ఆయన పేర్కొన్నారు ఈ మేరకు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు కాగితాల లక్ష్మయ్య ఎండి దస్తగిరి డి బాలరాజ్ దాసు ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బి రాములు తొందరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు రాజీవ్ చౌక్ గాంధీచౌక్ అంబేద్కర్ చౌక్ లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని మున్సిపాలిటీ అధికారులను వారు కోరారు*
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
