
ఉద్యోగుల జీతాల నుండి ప్రభుత్వం కోత విధించడాన్ని ఖండించిన….. జిల్లా టిటియు
వనపర్తి :
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు ఎలాంటి సమాచారం ఉత్తర్వులు ఇవ్వకుండా ఈ హెచ్ ఎస్ కొరకు 1.5% జీతాల నుంచి బలవంతంగా కోత విధించడాన్ని తెలంగాణ టీచర్స్ యూనియన్ తరపున వనపర్తి జిల్లా అధ్యక్షులు ఎం అనిల్ కుమార్ ప్రధాన కార్యదర్శిలు ఈ విష్ణువర్ధన్ రెడ్డిలు ఓ పేపర్ ప్రకటనలో ఖండించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఈ హెచ్ ఎస్ పేరుతో ఉద్యోగుల జీతాల నుండి 1.5% తీసుకోవడం ఎంతవరకు సమంజసము అని రాష్ట్రంలో ఏ ఆసుపత్రిలో ఏ ఆరోగ్యం పథకాన్ని అమలు చేస్తున్నారు ఇప్పటివరకు ఒక స్పష్టత లేదని భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులు అయితే వారి ఇద్దరి జీతాల నుండి ప్రీమియం కట్ చేసుకోవడం ఉద్యోగ దంపతులపై ఆర్థిక భారం పడుతుందని ఇది ఏ చట్టంలోఉందో ఆర్థిక శాఖ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఆరోగ్య కార్డులు లేవు ఆస్పత్రులతో ఒప్పందాలు లేవని కానీ జీతం కోతలు మాత్రం అవుతున్నాయని ఇది ఆర్థిక శాఖ నిరంకుశత్వానికి నిదర్శనం అని ఆవేదన వ్యక్తం చేశారు.పథకంలోని లోపాలను సరి చేసేవరకు జీతాల నుండి కోత విధించ కుండ నిలిపివేయాలని ప్రభుత్వము సమస్యపై పరిష్కారం చూపే వరకు ఉద్యోగులు ఉపాధ్యాయులు హక్కులు సంక్షేమం కోసం తెలంగాణ టీచర్స్ జిల్లా యూనియన్ తరపున పోరాటం చేస్తామని జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
