
స్వాతంత్ర సమర యోధురాలు కామ్రేడ్ పొడపంగి యల్లమ్మకు ఘన నివాళులు
మోతె: మండల పరిధిలోని రావిపహాడ్ గ్రామానికి చెందిన స్వాతంత్ర సమర యోధురాలు, సీపీఎం సీనియర్ కార్యకర్త కామ్రేడ్ పొడపంగి యల్లమ్మ (100) ఈ రోజు కన్నుమూశారు.
ఈ సందర్భంగా రావిపహాడ్ సీపీఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఆమె పార్ధివ దేహంపై ఎర్రజెండా కప్పి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం యల్లమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం గ్రామ శాఖ కార్యదర్శి ఎర్రబోయిన మల్సూర్, ఎస్. మల్లయ్య, ఎలుగు మధు, దాసరి వెంకన్న, బాపనపెల్లి నాగయ్య, ములకలపల్లి మల్సూర్ కుశనపల్లి మైషయ్య కుటుంబ సభ్యులు పొడపంగి యలమంచి, పొడపంగి సైదులు, పొడపంగి వేణు, పొడపంగి బిక్షం, రావిచెట్టు మణికుమార్, రావిచెట్టు పరమేష్ తదితరులు పాల్గొని
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కామ్రేడ్ పొడపంగి యల్లమ్మ స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో పాటు ప్రజా ఉద్యమాల్లో చూపిన నిబద్ధత యువతకు ఆదర్శమని కొనియాడారు. ఆమె సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించారు
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
