జూన్ 10న జరిగే కలెక్టరేట్ ధర్నాను విజయవంతం చేయండి.సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ పిలుపు.

TEJA NEWS

జూన్ 10న జరిగే కలెక్టరేట్ ధర్నాను విజయవంతం చేయండి.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ పిలుపు.

పెరుగుతున్న నిత్యవసర వస్తువులు ధరలను తగ్గించాలని కోరుతూ సిపిఐ మేడ్చల్ జిల్లా సమితి తరపున జూన్ 10 నాడు మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నాను నిర్వహిస్తున్నామని కావున అట్టి ధర్నాలో కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ నేడు సిపిఐ ఆధ్వర్యంలో జగద్గిరిగుట్ట కార్యాలయం వద్ద గోడ పత్రికను విడుదల చేయడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కే ఏసురత్నములు మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వచ్చినంక పెట్రోల్ డీజిల్ ధరలు అమాంతం పెరిగిపోయి నిత్యవసర వస్తువుల ధరలు రెండు రెట్లు ఎక్కువ పెరగడం వల్ల ప్రజలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని, ధరలు పెరుగుతున్నాయి కానీ వారి ఆర్థిక పరిస్థితులు మాత్రం మెరుగవట్లేదని అన్నారు. అదే మోడీ మిత్రులైన ఆదాని, అంబానీలఆర్దిక పరిస్థితులు వేల కోట్లు పెరిగాయని, నిత్యం మోడీ ఇతర దేశాలకు వెళ్లి తన సహజ మిత్రుడు అయినటువంటి ఆదాని కీ అనేక కాంట్రాక్టులు ఇప్పించి లక్షల కోట్లాది రూపాయలను సంపాదించి పెడుతున్నాడని, మోడీకి ఓటు వేసినటువంటి పేద ప్రజల సంపాదన పెరుగుదలకు మాత్రం కృషి చేయట్లేదని అన్నారు. దేశంలో రోజురోజుకు పేదరికం పెరిగిపోతుందని, ఇప్పటికైనా వస్తువుల ధరలు తగ్గించి పేద ప్రజల ఆర్థిక స్థితిలను పెంచాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నదని దానికోసం ప్రజలంతా ఐక్యమై పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. కావున భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట జరిగే ధర్నాను విజయవంతం చేయాల్సిందిగా కోరడం జరిగింది.


ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శులు హరినాథ్ రావు, రాములు జిల్లా కౌన్సిల్ సభ్యులు నరసింహారెడ్డి ప్రజానాట్యమండలి అధ్యక్షుడు బాబు సిపిఐ నాయకులు దేవనందం, జానకిరామ్, ఇమామ్, కృష్ణ, నాగేశ్ చారి యువజన నాయకుడు కీర్తి తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top