చేపల వేటకు సర్వం సిద్ధం… గ్రామస్తుల్లో అసంతృప్తి

Spread the love

చేపల వేటకు సర్వం సిద్ధం… గ్రామస్తుల్లో అసంతృప్తి

సూర్యపేట జిల్లా ప్రతినిధి

టేకుమట్ల గ్రామంలోని దాచారం చెరువులో ఈ రాత్రి (08.06.2026) చేపల వేట (చాపలు పట్టడం) నిర్వహించేందుకు నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు. ఏర్పాట్లు పూర్తిచేసి వేటకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో గ్రామంలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. గతంలో చేపలు పట్టినప్పుడు గ్రామ ప్రజలకు అమ్మకుండా నేరుగా దళారులకు విక్రయిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో స్థానికులకు చేపలు అందకుండా పోతున్నాయని వారు అంటున్నారు. ఈసారి అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని గ్రామ యువకులు డిమాండ్ చేస్తున్నారు. ముందుగా టేకుమట్ల గ్రామ ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు చేపలు అమ్మిన తర్వాతే మిగిలిన చేపలను ఇతర ప్రాంతాలకు తరలించాలని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ అంశంపై గ్రామంలో చర్చలు సాగుతుండగా, నిర్వాహకులు ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

You cannot copy content of this page

Scroll to Top