
మెరుగైన మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత : బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్
130 – సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని రాజుల స్వామి నగర్, సిద్దార్థ్ నగర్, జై శ్రీరామ్ నగర్, మరాఠీ బస్తీలలో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వసతుల సమస్యలపై బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు.
ఈ సందర్భంగా రాజుల స్వామి నగర్లో భూగర్భ డ్రైనేజీ అవుట్ లెట్ సమస్య, సిద్ధార్థ నగర్ లో భూగర్భ డ్రైనేజీ సమస్యతో పాటు శానిటేషన్ సమస్య, వరద నీటి సమస్య, జై శ్రీరామ్ నగర్ లో సీసీ రోడ్డు సమస్యతో పాటు నాలా సమస్యను పరిశీలించిన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ పారిశుధ్య నిర్వహణ, భూగర్భ డ్రైనేజీ పనులలో అధికారుల నిర్లక్ష్య వైఖరి పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
అనంతరం వారు మాట్లాడుతూ….
గత 12 ఏళ్ల కాలంలో కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి కుత్బుల్లాపూర్ ను ఎంతో అభివృద్ధి పరిచామని, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని రానున్న రోజుల్లో కూడా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుభాష్ నగర్ డివిజన్ తో పాటు అన్ని ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో కొంపల్లి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ లావణ్య, ఈఈ సుబ్రహ్మణ్యం, డీజీఎం శ్రావణి, వివిధ విభాగాల అధికారులు అలాగే స్థానిక నాయకులు మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, పోలే శ్రీకాంత్, వారాల వినోద్, రాజ్ కుమార్ ముదిరాజ్, కోల శ్రీకాంత్ ముదిరాజ్, గుబ్బల లక్ష్మీ నారాయణ, రవి, వేణు, మరాటి అశోక్, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, స్వామి, చందు,గట్టు అశోక్, కాలనీల సంక్షేమ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
