
అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులను పరామర్శించిన శంభీపూర్ క్రిష్ణ ..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ గాగిల్లాపూర్ తాండ మరియు దుండిగల్ తండాకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త జగన్ నాయక్ ఊపిరి తితులకు సంబందించిన వ్యాధితో బాధ పడుతున్నారు, అదేవిధంగా కిడ్నీ ఊపిరితూతులకు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కాట్రోత్ లక్ష్మణ్ నాయక్ ని మాజీ కౌన్సిలర్ కొర్ర శంకర్ నాయక్ తో కలిసి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ పరామర్శించారు. వారు మాట్లాడుతూ అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. అనంతరం కిడ్నీ బాధితులు అయినా లక్ష్మిబాయి మరియు ఫకీరా రాజు గార్లను వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా ప్రజలు సమస్యలు తెలియజేస్తూ అక్కడ ఉన్న ప్రధాన సమస్య వాయు కాలుష్యం, కలుషితమైన నీళ్ల కారణంగా, తాండ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ప్రజలకు మంచినీళ్లు సౌకర్యం కల్పించి ఆదుకోవాలనీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ప్రెసిడెంట్ అమర్ సింగ్ నాయక్, వెంకటేష్ నాయక్, ప్రవీణ్ నాయక్, హనుమంతు, నర్సింగ్ నాయక్, కుమార్ నాయక్, రాజు నాయక్, వాసు నాయక్, పటేల్ రెడ్యా నాయక్, మరియు తదితరులు పాల్గొన్నారు..
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
