
పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకారం…
ప్రజలకు పారదర్శక పరిపాలన అందించేందుకు కృషి చేస్తా….
–కొప్పుల వెంకట్ రెడ్డి…
పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: పెద్దపల్లి,
పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా కొప్పుల వెంకట్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజనల్ అధికారిగా విధులు నిర్వహించిన కొప్పుల వెంకట్ రెడ్డికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన బదిలీలు, పదోన్నతుల్లో భాగంగా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా పదోన్నతి లభించడంతో పెద్దపల్లి జిల్లాకు బదిలీ చేశారు.
ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్న ఆయన అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా బాధ్యతలు స్వీకరించి విధుల్లో చేరారు.
ఈ సందర్భంగా జిల్లా అధికారులను కలుసుకున్న కొప్పుల వెంకట్ రెడ్డి ప్రజలకు పారదర్శకమైన, సమర్థవంతమైన పరిపాలన అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.