ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు గొప్ప అవకాశం

Spread the love

ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు గొప్ప అవకాశం
శిక్షణ సమయంలో నెలకు రూ.15 వేల స్టైపండ్…

అనంతరం ఫార్మసీ డిగ్రీతో పాటు ఉద్యోగ అవకాశం…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:పెద్దపల్లి,
పెద్దపల్లి జిల్లా పరిధిలో 2024-25, 2025-26 విద్యా సంవత్సరాల్లో ఎంపీసీ, బైపీసీ విభాగాల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు ప్రముఖ సంస్థ గ్రాన్యుల్స్ ఇండియా లిమిటెడ్, హైదరాబాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఈ శిక్షణకు ఎంపికైన విద్యార్థులకు మూడు నెలల పాటు శిక్షణ అందించడంతో పాటు నెలకు రూ.15 వేల స్టైపండ్ చెల్లించనున్నారు. శిక్షణ కాలంలో వసతి సౌకర్యం కూడా కల్పించనున్నారు.

శిక్షణ అనంతరం టాటా ఇన్‌స్టిట్యూట్ సంస్థలో ఫార్మసీ గ్రాడ్యుయేషన్ డిగ్రీలో ప్రవేశం కల్పించడంతో పాటు ప్రతి సెమిస్టర్‌కు రూ.30 వేల ఫీజును సంస్థే భరిస్తుంది. అదేవిధంగా హాస్టల్ వసతి కూడా అందించనున్నారు.
కోర్స్ పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఆసక్తి గల విద్యార్థులు మరిన్ని వివరాల కోసం ఈ నెల 20వ తేదీ లోపు పెద్దపల్లి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కల్పనను కలెక్టరేట్ కార్యాలయంలోని ఇంటర్మీడియట్ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

You cannot copy content of this page

Scroll to Top