ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి సంయుక్త పోరాటం అవసరం కల్వకుంట్ల కవిత…

Spread the love

ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి సంయుక్త పోరాటం అవసరం కల్వకుంట్ల కవిత…

పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: గోదావరిఖని,గోదావరిఖనిలోని సింగరేణి ఆసుపత్రి నుండి చౌరస్తాలోని హెచ్‌ఎంఎస్ కార్యాలయం వరకు బీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆటోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్ స్వయంగా ఆటో నడుపుతూ ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఆమెకు వివరించారు.

ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ఆటో వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు, రూ.12 వేల ఆర్థిక సహాయం తదితర డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆటో జేఏసీ నాయకులు కల్వకుంట్ల కవితకు అందజేశారు. సమస్యలను ఓపికగా విన్న ఆమె సానుకూలంగా స్పందించారు.

ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం ఆటో జేఏసీ, బీఆర్ఎస్ పార్టీ సంయుక్తంగా ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధం కావాలని సూచించారు. ఆటో కార్మికుల సంక్షేమం కోసం తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంఎస్ అధ్యక్షుడు రియాజ్ అహ్మద్, తెలంగాణ జాగృతి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు అందే సదానందం, ఆటో జేఏసీ పెద్దపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కాజీపేట రాజయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు మొహమ్మద్ గౌస్, కార్పొరేషన్ ఉపాధ్యక్షుడు ఎండీ జబ్బర్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top