సీఎం సహాయనిధి పేదలకు గొప్ప వరం – కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

Spread the love

| సీఎం సహాయనిధి పేదలకు గొప్ప వరం – కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ||

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని బాచుపల్లికి చెందిన బొల్లం సంజీవ రావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్సకు అవసరమైన ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని సంప్రదించారు.

వెంటనే స్పందించిన హన్మంతన్న, తెలంగాణ శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సహకారంతో బాధితులకు వైద్య చికిత్స మరియు శస్త్రచికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF – LOC) ద్వారా రూ.2,75,000/- (రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు) మంజూరు అయ్యేలా చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా మంజూరైన CMRF – LOC పత్రాలను కొలన్ హన్మంత్ రెడ్డి బాధితులక కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, “సీఎం సహాయనిధి పేద ప్రజలకు గొప్ప వరం. ఆర్థిక ఇబ్బందులతో చికిత్స పొందలేని వారికి ప్రభుత్వం అండగా నిలుస్తూ వారి జీవితాల్లో ఆశను నింపుతోంది” అని తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top