మాజీ కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు కొండేటి నర్సిరెడ్డికి ఘన నివాళులు

Spread the love

మాజీ కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు కొండేటి నర్సిరెడ్డికి ఘన నివాళులు

సూర్యపేట జిల్లా :

సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం దోసపహాడ్ గ్రామానికి చెందిన మాజీ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు కొండేటి నర్సిరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. సోమవారం ఆయన దశదిన కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామ పెద్దల సమక్షంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై నర్సిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నర్సిరెడ్డి అందించిన సేవలను నాయకులు ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

పార్టీ అభివృద్ధి కోసం ఆయన నిస్వార్థంగా పనిచేసి ప్రజల అభిమానాన్ని సంపాదించారని కొనియాడారు. దశదిన కార్యక్రమానికి ఏఐసీసీ సభ్యులు సర్వోత్తంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వేణారెడ్డి హాజరై కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. నర్సిరెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి, గ్రామానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, బంధుమిత్రులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top